Suriya | కోలీవుడ్ నటుడు శివ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన సూర్య ఆనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య సినిమాలకి మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఏ పాత్ర చేసిన అందులో ఒదిగిపోతారు. సూర్యకి తమిళనాటనే కాదు తెలుగులోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేసి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న సూర్య తన సినీ జర్నీలో కొన్ని మంచి సినిమాలు వదిలేసుకున్నాడు. అవి బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అవి కూడా చేసి ఉంటే సూర్య రేంజ్ పీక్స్‌కి వెళ్లడం ఖాయం.
అజిత్ నటించిన ఆశ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాని సూర్యని పెట్టి దర్శకుడు వసంత్ తెరకెక్కించాలని అనుకున్నాడట. కాని అప్పుడు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేకపోవడంతో రిజెక్ట్ చేశాడు. మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇక కార్తి హీరోగా అమీర్ డైరెక్షన్లో 2007లో రిలీజ్ అయి సూపర్ హిట్ సినిమా పరుత్తివీరన్. ఈ సినిమాలో మొదట హీరోగా సూర్యని అనుకోగా, ఈ కథని తన తమ్ముడి కోసం త్యాగం చేశారు. ఈ మూవీ కార్తీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక మురుగదాస్ డైరెక్షన్లో గజిని సినిమాలో నటించిన సూర్య, ఆ తర్వాత ఆయనతో కలిసి మళ్లీ ఓ సినిమా చేయాలి అనుకున్నారట. ఆ చిత్రం మరేదో కాదు తుపాకి. కొన్ని కారణాల వలన ఆ చిత్రం సూర్య నుండి విజయ్‌కి వెళ్లింది. ఈ మూవీ విజయ్ కెరీర్లోనే ఓ మైలు రాయిగా నిలిచింది.
సూర్య మిస్ చేసుకున్న సినిమాల్లో రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి చిత్రం కూడా ఉంది. ఇందులో బాహుబలి పాత్ర కోసం ముందుగా సూర్యనే అనుకున్నాడట రాజమౌళి. అయితే ఆ కథకు తాను సరిపోతానా అని డౌట్ వచ్చి, ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట సూర్య. ఆ తర్వాత ప్రభాస్ బాహుబలిగా నటించి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అదే సూర్య చేసి ఉంటే ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చి ఉండేవో అని ఫ్యాన్స్ ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు.