Jailer 2 | సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ చిత్రం మంచి విజయం సాధించడంతో ఇప్పుడు జైలర్ 2 చిత్రాన్ని మొదలు పెట్టారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు చెన్నైలో జరుగుతుంది. గత కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇందులో పలువురు స్టార్ హీరోలు కూడా భాగం కానున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు గెస్ట్ అప్పియిన్స్ తో అదొరగొట్టనున్నారని చెప్పడంతో ఫ్యాన్స్ కి ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.
ఇక ఇటీవల ఈ సినిమాలో చిరంజీవి, బాలయ్య ఇద్దరు కూడా నటించనున్నారని ప్రచారం జరిగింది. దీంతో తెలుగు ఫ్యాన్స్ ఈ వార్త నిజమైతే బాగుండు అని అనుకుంటున్నారు. అయితే జైలర్ 2 కోసం టాలీవుడ్ నుంచి నటసింహా బాలకృష్ణ పవర్ ఫుల్ రంగంలోకి దిగనున్నాడని, ఆయన తన పాత్రతో అదరగొట్టడం ఖాయం అంటున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా తెరపై కనిపించినంత సేపు ఆయన పాత్రని విధ్వంసంగానే చూపించబోతున్నారని సమాచారం. తాజాగా మరో సంచలన నటుడి పేరు తెరపైకి వస్తోంది
కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య కూడా ఇందులో ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇందులో బాలయ్యది పాజిటివ్ రోల్ అని, సూర్యది నెగెటివ్ రోల్ అని అంటున్నారు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం సాగనుందని, ఇది ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుందనే టాక్ అయితే గట్టిగా నడుస్తుంది. ఇద్దరి మధ్య భారీ యాక్షన్ ప్లాన్ చేస్తే సూపర్ స్టార్ ఇమేజ్ సైతం కొట్టుకుపోయే పెర్పార్మెన్స్ తో అదర గొడతారు. నెల్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఏయే హీరోలతో ఈ ప్రాజెక్ట్‌ని మరింత ఇంట్రెస్టింగ్గా మారుస్తాడో అన్నది రానున్న రోజులలో తెలియనుంది.