Thalapathy Vijay in beast | ఇళయతళపతి విజయ్‌కు తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా వచ్చిందంటే ఆయన ఫ్యాన్స్‌కు పండగే. పైగా ఇటీవల ఈయన నటించిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలుస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో మాస్టర్ సినిమా ప్రభంజనం సృష్టించింది. కరోనా మొదటి వేవ్ తర్వాత థియేటర్లలోకి ప్రేక్షకులు రావడానికి జంకుతున్న సమయంలోనూ విడుదలై రికార్డు కలెక్లన్లు రాబట్టింది. తెలుగులోనూ ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ఇప్పుడు నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో బీస్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకొచ్చింది.
విజయ్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్‌నే ఉంది. ఈయన సినిమాలకు ఇప్పుడు తెలుగులో కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అందుకే టాలీవుడ్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేందుకు నేరుగా తెలుగులో ఒక సినిమా చేయబోతున్నాడు విజయ్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న బీస్ట్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన విజయ్ లుక్ గూస్బంప్స్ పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా స్టోరీ, అందులో విజయ్ క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది. ఈ సినిమాలో విజయ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక షాపింగ్ మాల్లో హైజాక్ అయిన ప్రజలను తన టీమ్‌తో కాపాడబోయే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో విజయ్ కనిపించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమాలో కూడా విజయ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించాడు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. తుపాకీ సినిమా తర్వాత ఇప్పుడు మళ్లీ ఇన్నేండ్లకు విజయ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Vijay Sethupathi Attack | విజయ్ సేతుపతిపై దాడి..వీడియో వైరల్
పులితో పరాచాకాలు ఆడుతున్న విజయ్ హీరోయిన్
Alia bhatt | అమ్మో రెండేండ్లలో ఆలియాభట్ అంత సంపాదించిందా?
Nithiin | మొన్న సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు నితిన్ !!
Samantha | సమంత చేసిన పనికి అంతా షాక్.. గే పెళ్లికి సపోర్ట్..
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?