Thalapathy Vijay | తమిళ అగ్ర నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజల కోరిక మేరకు రాజకీయల్లోకి వస్తున్నట్లు గత ఏడాది తన రాజకీయ పార్టీని అనౌన్స్ చేశాడు. తమిళ వెట్రి కళగం (Tamizha Vetri Kazhagam) అంటూ తన పార్టీ పేరును ప్రకటించాడు. అయితే ఈ పార్టీ 2024 ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని అలాగే ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదని విజయ్ తెలిపాడు. జనరల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
అయితే ఒకవైపు తన సినిమాలు చేస్తునే మరోవైపు రాజకీయంగా గ్రౌండ్ లెవల్లో దూసుకుపోతున్నాడు. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ది గోట్(The Greatest Of All Time). వెంకట్ ప్రభు దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అనంతరం విజయ్ సినిమా తగ్గించి ఫుల్ టైం పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే పార్టీ బలంగా ఉండడానికి ఇప్పటినుంచే ఫండ్స్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
తాజా సమాచారం ప్రకారం. పార్టీ నడపడానికి అవసరమైన నిధుల కోసం తనకు చాలా ఇష్టమైనా రోల్స్ రాయిస్ కారు అమ్ముతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కార్ మోడల్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కాగా.. ఈ కారును విజయ్ 2012లో దిగుమతి చేసుకున్నాడు. అప్పట్లో ఈ కారుకి పన్ను కట్టలేదని మద్రాస్ హైకోర్టు విజయ్‌కి రూ.లక్ష వరకు జరిమానా కూడా విధించింది. అయితే అది కారు రిజిస్ట్రేషన్‌లో లోపం కారణంగా పన్ను చెల్లించడంలో లేట్ అయ్యిందని తర్వాత వెల్లడించారు. ఇక ఈ కారు తీసుకుని 12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు 22000 కి.మీ కూడా నడపలేదని సమాచారం. అయితే ఈ కారుని అమ్ముతున్నట్లు ఎంపైర్ ఆటోస్ డీలర్షిప్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ కారు కోసం ఎంపైర్ ఆటోస్ రూ. 2.6 కోట్లు కోట్ చేస్తుండగా.. ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని సంస్థ వెల్లడించింది.
Also Read..
Punjab CM Bhagwant Mann: పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు.. పంజాబ్ సీఎంకు దక్కని అనుమతి