Punjab CM Bhagwant Mann: పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు.. పంజాబ్ సీఎంకు దక్కని అనుమతి
Punjab CM Bhagwant Mann: పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమతి దక్కలేదు. ఆగస్టు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆయన పారిస్‌లో గడపాల్సి ఉన్నది. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న పంజాబీ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు సీఎం భగవంత్‌మాన్ పారిస్ వెళ్లాలనుకున్నారు.
చండీఘడ్: పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు పంజాబ్ సీఎం భగవంత్‌మాన్(Punjab CM Bhagwant Mann)కు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమతి దక్కలేదు. ఆగస్టు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆయన పారిస్‌లో గడపాల్సి ఉన్నది. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న పంజాబీ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు సీఎం భగవంత్‌మాన్ పారిస్ వెళ్లాలనుకున్నారు. అయితే ఆయన ప్రయాణానికి పర్మిషన్ ఇవ్వడం లేదని సీఎంవో ఆఫీసుకు సమాచారం ఇచ్చారు.
స్వంత ఖర్చులతో పారిస్ వెళ్లేందుకు రెఢీగా ఉన్నట్లు పంజాబ్ సీఎం మాన్ తెలిపారు. హాకీ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. హాకీ జట్టులో పది మంది పంజాబీ ప్లేయర్లే ఉన్నారు. కీలకమైన మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో.. మన జట్టుకు అండగా ఉండాలని అనుకున్నట్లు ఆయన చెప్పారు. కానీ ప్రధాని మోదీ మాత్రం ఒంటరిగా విదేశీ ప్రయాణాలు చేస్తుంటారని సీఎం మాన్ పేర్కొన్నారు.
పారిస్‌కు వెళ్లిన భారత బృందంలో.. 19 మంది పంజాబీ ప్లేయర్లు ఉన్నట్లు సీఎం వెల్లడించారు. 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై మ్యాచ్ నెగ్గి హాకీ ఆటగాళ్లు హిస్టరీ క్రియేట్ చేశారని, జట్టులో పది మంది క్రీడాకారులు పంజాబీలే అని తెలిపారు. అయితే పారిస్ వెళ్లేందుకు చాలా ఆలస్యంగా దరఖాస్తు చేస్తున్నట్లు తమ ఆఫీసు వాళ్లు చెప్పారని సీఎం మాన్ వెల్లడించారు.
గతంలో అమెరికా వెళ్లేందుకు కేజ్రీవాల్‌కు అనుమతి ఇవ్వలేదని, అమెరికా వెళ్లేందుకు గోపాల్ రాయ్‌కి కూడా అనుమతి ఇవ్వలేదని మాన్ గుర్తు చేశారు. కోర్టుకు వెళ్తేనే పర్మిషన్ ఇస్తున్నారని, ఇప్పుడు కూడా కోర్టుకు వెళ్లాలా అని ఆయన ప్రశ్నించారు.
సీఎం భగవంత్ మాన్కు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదన్న అంశాన్ని కేంద్ర క్లియర్‌గా చెప్పలేదు. అయితే మాన్కు జడ్ ప్లస్ సెక్యూర్టీ ఉందని, ఆయన సెక్యూర్టీ అంశంలో కేంద్ర సర్కారు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

