Naveen Polishetty | టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అమెరికాలో ఇటీవల ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తన కుడి చేతికి ఫ్యాక్చర్ కాగా.. కాలుకు గాయమైంది. ఈ ఘటన జరిగి 3 నెలలు అవుతుంటే రీసెంట్గా తనకు ప్రమాదం అయినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించాడు. యాక్సిడెంట్ తర్వాత కోలుకోవడం చాలా కష్టంగా ఉందని.. నా రికవరీకి వైద్యులు సహాయపడుతున్నారు అని మునుపెన్నడూ లేనంత బలంగా, ఆరోగ్యంగా తిరిగి రావాలని డిసైడ్ అయ్యాను. అంటూ అందులో రాసుకోచ్చాడు.
అయితే ప్రమాదం వలన బెడ్ రెస్ట్ అయిన నవీన్ పోలిశెట్టి తనను తాను ట్రోల్ చేసుకుంటూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో నవీన్ టీవీ చూస్తుండగా.. సింగిల్ హ్యాండ్ (వెంకటేష్ గణేష్ మూవీలోని డైలాగ్) గణేష్ అంటూ రాగా.. తనని తాను చూసుకుంటూ ఛానల్ మార్చమంటాడు. ఆ తర్వాత చేయి చూసావా ఎంత రఫ్‌గా ఉందో అంటూ గ్యాంగ్ లీడర్ డైలాగ్ వస్తుంది. దీంతో చిరాకు పడిన నవీన్ చేయి మీద డైలాగ్‌లు లేని ఛానల్ ఏదైనా పెట్టు అంటాడు. ఛానల్ మార్చాగా క్రికెట్లో అంపైర్ సిక్స్ అంటూ చేతులు పైనకి లేపుతాడు. ఇలా తనకి ఇంకో పని చేయట్లేదని హ్యూమర్‌గా చెబుతూ.. వీడియోను క్రియేట్ చేశాడు. ఇక వీడియో చివరిలో తన కూడి చేయి ఫ్యాక్చర్ కాగా అన్నం తిందామని ఎడమ చేయి వాడతాడు. దీంతో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో ఏంటి ఎడమ చేతితో తింటున్నావ్. ఇదేనా మన సంస్కారం అనగా.. సంస్కారం ఇంపార్టెంట్రా అంటూ డాగ్‌లా తింటున్నట్లు వీడియో క్రియేట్ చేశాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
NEW VIDEO. Life oka zindagi aipoyindi 😜 See you soon JaaneJigars ❤️ pic.twitter.com/6sNZ4L7nt4
— Naveen Polishetty (@NaveenPolishety) August 3, 2024
జీవితంలో ఉన్న సమస్యలతో పోరాడటానికి హాస్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎల్లప్పుడు నవ్వుతూ ఉండు. నేను మిమ్మల్ని నవ్వించడం అనేది ప్రేమిస్తున్నాను. పూర్తి రికవరీ తర్వాత కొత్త చిత్రాలతో త్వరలో బిగ్ స్క్రీన్‌పై కలుద్దాం. మీ జానీజిగర్. నవీన్ పోలిశెట్టి అంటూ రాసుకోచ్చాడు.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, చిచ్చోరే, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్. తన కామెడీ టైమింగ్‌తో సినిమాలోనే కాకుండా బయట కూడా తనకంటూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.
Also Read..
Bomb Threat | స్కూల్‌కు వెళ్లడం ఇష్టంలేక.. బాంబు బెదిరింపు మెయిల్ పంపిన విద్యార్థి
KTR | పోరాటాలు మాకు కొత్తేంకాదు.. బూతులు తిట్టినా.. అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం: కేటీఆర్
Buddha Venkanna | టీడీపీ అధికారంలోకి వచ్చాక నాకు న్యాయం జరగలేదు.. బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు