సినిమా వసూళ్లలో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని, అద్దె ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శించడం వల్ల నష్టాలొస్తున్నాయని సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు జూన్ 1 నుంచి బంద్ నిర్వహించే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించారు.
అయితే ఈ సమావేశంలో షేరింగ్ విధానంపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. దీంతో ఆల్సెక్టార్లతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలు ప్రతిపాదించారు. ఈ నెల 23న మరోసారి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశమై తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారని సమాచారం.