Telugu Film Chamber of Commerce | డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master)పై రాయదుర్గం పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసు విచారణను నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber of Commerce)లో 2018 నుంచి లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ అందుబాటులో ఉందని ఛాంబర్ ఓ ప్రకటనలో తెలియజేసింది.
డాన్సర్ నుంచి వచ్చిన ఫిర్యాదు స్వీకరించబడింది. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ , డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో కొరియోగ్రఫర్‌పై వచ్చిన ఫిర్యాదును పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేయగా.. విచారణ కొనసాగుతోంది. మహిళలు ఏదైనా లైంగిక వేధింపుల విషయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఆఫీస్ వద్ద ఫిర్యాదు బాక్స్ పెట్టాం.
ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డా. డి రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ -500096 చిరునామాకు పంపించవచ్చని ప్రకటనలో పేర్కొంది. ఫోన్ నంబర్/వాట్సాప్ నంబర్ : 9849972280, ఈమెయిల్ ఐడీ : complaints@telugufilmchamber.in
Jani Master | పెద్ద హీరో ఆ అమ్మాయికి సినిమాలో అవకాశమిస్తామన్నారు.. జానీ మాస్టర్ వివాదంపై ఝాన్సీ