Bharat Bushan | తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) నూతన అధ్యక్షుడిగా వైజాగ్‌కు చెందిన భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఈనెల 31తో నిర్మాత దిల్ రాజు పదవి కాలం పూర్తి అవుతుంది. దీంతో ఎన్నికలు నిర్వహించారు.
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో ఠాగూర్ మధు, భరత్ భూషణ్ ప్యానెల్లు పోటీ పడ్డాయి. మొత్తం 48మంది సభ్యుల్లో 46 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో 29మంది సభ్యులు భరత్ భూషణ్ కు అనుకూలంగా ఓటు వేయగా.. 17మంది ఠాగూర్ మధుకు ఓటు వేశారు. ఇక మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు రావడంతో భరత్ భూషణ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక గతంలో ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దిల్ రాజును ఎన్నుకున్న సభ్యులు ఈసారి డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి భరత్ భూషణ్‌ను ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
Congrats to #BharatBhushan garu for being elected as President for Telugu Film Chamber Of Commerce pic.twitter.com/og8QZvntGX
— Vamsi Kaka (@vamsikaka) July 28, 2024
Also read..