Actress Hema | బెంగళూరు రేవ్‌పార్టీ కేసు (Bengaluru rave party case)లో అరెస్టైన తెలుగు సినీ నటి హేమ (Actress Hema)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోఉన్న ఆమెకు బుధవారం బెయిల్ మంజూరైంది. ఈ కేసుపై విచారణ జరిపిన బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ (conditional bail) మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
గత నెల మే 19న కర్ణాటక రాజధాని బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని బీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున మత్తుపదార్థాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు టీవీ నటీనటులు (Telugu Stars), మోడళ్లు, బడాబాబులు పట్టుబడ్డారు. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. డ్రగ్స్ టెస్ట్‌లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. హేమతో పాటు డ్రగ్స్ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. ఈ కేసులో జూన్ 3న హేమను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Also Read..
Dhamna | బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
Sunny Leone | సన్నీ లియోన్ ఈవెంట్‌కు కేరళ యూనివర్సిటీ నిరాకరణ.. ఎందుకంటే..?
Ice Cream | కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు.. ముంబై వైద్యుడికి ఊహించని అనుభవం