మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన అంజలి .. ఈసారైనా నిలదొక్కుకుంటుందా
మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన అంజలి | తమిళనాట ఇప్పటికీ వరస సినిమాలు చేస్తుంది అంజలి. కానీ మాతృభాషలో స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని ప్రయత్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

పేరుకు తెలుగు అమ్మాయి అయినా కూడా తెలుగులో అవకాశాలు అందుకోవడానికి హీరోయిన్ అంజలికి చాలా ఆలస్యం అయింది. ఫోటో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. దాంతో పాటు హీరో జైతో లవ్ స్టోరీ కూడా ఈమెకు ఫ్రీ పబ్లిసిటీ తీసుకొచ్చింది. ఆ తర్వాత మధ్యలో కొన్ని కాంట్రవర్సీలు కూడా హెడ్లైన్లో ఉంచాయి. అలాంటి సమయంలో తెలుగులో మళ్లీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అదే ఊపులో బాలకృష్ణ, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కూడా నటించింది.

అయితే ఉన్నట్టుండి మళ్లీ అంజలి సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎందుకో డల్ అయిపోయింది. అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. తమిళనాట ఇప్పటికీ వరస సినిమాలు చేస్తుంది అంజలి. అయితే మాతృభాషలో స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించింది అంజలి. ఇందులో జరీనా పాత్రలో అద్భుతంగా నటించింది అంజలి. ఈ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు అంజలికి అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో అంజలి కోసం దర్శక నిర్మాతలు మళ్లీ పోటీ పడుతున్నారు.
తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ఎఫ్ 3 సినిమాలో అంజలి కూడా ఒక హీరోయిన్గా నటించబోతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు అవకాశాలు కూడా ఈమె కోసం ఎదురు చూస్తున్నాయి. కనీసం ఇప్పుడైనా కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకొని నిలదొక్కుకుంటుందేమో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
ఫెస్టివల్ లుక్‌లో సాయిపల్లవి..న్యూ పోస్టర్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..
ఓటీటీలో వకీల్ సాబ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!
టాలీవుడ్‌కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?
వకీల్ సాబ్ సినిమాలో పవన్ తెలంగాణ యాసకు కారణం ఇదే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

