సాంస్కృతిక మూలాల్ని గుర్తుచేసే ‘శనార్తి’
‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేం అఖిల్‌రాజ్, తెలంగాణ జానపద గీతాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ హీరోహీరోయిన్లుగా రాబోతున్న తెలంగాణ నేపథ్య ప్రేమకథ ‘శనార్తి’.
‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేం అఖిల్‌రాజ్, తెలంగాణ జానపద గీతాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ హీరోహీరోయిన్లుగా రాబోతున్న తెలంగాణ నేపథ్య ప్రేమకథ ‘శనార్తి’. గణేశ్రాజ్ ఉప్పునూటి దర్శకుడు. కేవీ శ్రీధర్‌రెడ్డితో కలిసి ప్రముఖ దర్శకుడు సంపత్‌నంది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వెలిచాలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లాంఛనంగా మొదలైంది.
సుమారు నెల రోజుల పాటు వెలిచాల, గట్టు భూత్కూరు పరిసరాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగనున్నదని, తెలంగాణ సంప్రదాయ, సాంస్కృతిక మూలాల్ని గుర్తు చేసే కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతినిస్తుందని మేకర్స్ నమ్మకం వెలిబుచ్చారు. మురళీధర్‌గౌడ్, సునందిని, సుంకర లక్ష్మి, రమేష్ నకిరికంటి, వైవా రెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్‌రెడ్డి, సంగీతం: సురేశ్ బొబ్బిలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

