హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : రుణ వసూళ్లలో భాగంగా యూనియన్ బ్యాంకు నిర్వహించిన వేలం వివాదంలో ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్, ఆయన కుటుంబానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రుణ వసూళ్లలో భాగంగా హామీదారులుగా ఉన్న బండ్ల గణేశ్‌కు చెందిన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని హైకోర్టు సమర్థించింది.
వేలం ద్వారా జరిగిన విక్రయాన్ని రద్దు చేయడంతోపాటు వచ్చిన సొమ్మును ఆస్తి యజమానులకు, బండ్ల గణేశ్, ఇతర కుటుంబసభ్యులకు చెల్లించాలంటూ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్టీ) ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసింది.