Akhanda 2 | టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) కాంబోలో వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2). టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉండగా . సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడి.. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా టికెట్ రేట్ల పెంపుపై జీవో జారీ చేసింది. అఖండ 2 ప్రీమియర్స్ రేపు రాత్రి 8 గంటలకు వేయనుండగా.. టికెట్ ధరను రూ.600 (జీఎస్టీతో సహా)గా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్స్ : ప్రస్తుత టికెట్ ధరపై అదనంగా రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లు అదనంగా రూ.100 (జీఎస్టీతో కలిపి) పెంచేందుకు అనుమతిచ్చారు. మొదటి మూడు రోజులపాటు ఈ పెంచిన టికెట్ ధరలు అమలులో ఉండనున్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెంచిన ధరల ద్వారా థియేటర్లకు వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమ నిధికి కేటాయించాలి. ఈ మొత్తం తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఖాతాకు జమ అవుతుంది. ఈ ఫండ్ నిర్వహణ కోసం ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) ద్వారా కార్మిక కమిషనర్‌తో సంప్రదించి ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. హర్షాలి మల్హోత్రా, పూర్ణ, కబీర్ దుహన్ సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన అఖండ 2 టీజర్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఫస్ట్ పార్టుకు మించిన స్కోర్ సీక్వెల్లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి. అఖండ 2 చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Aarambhikalama 🥁🥁🥁
TG GO vachesindi 🕺#Akhanda2#NandamuriBalakrishna pic.twitter.com/QIQiJyxCC6
— H C (@hchalasani) December 10, 2025
Karthi | హిట్ 4 ఎప్పుడు.. కార్తీ ప్రశ్నకు డైరెక్టర్ శైలేష్ కొలను ఏం చెప్పాడంటే..?
Bigg Boss 9 | బిగ్ బాస్ సీజన్9లో ఊహించని ట్విస్ట్.. మిడ్ వీక్‌లో ఒక ఎలిమినేషన్ ?
Akhanda 2 | అఖండ 2 దెబ్బకి ఇన్ని సినిమాలు వాయిదా పడ్డాయా.. ఏకంగా రజనీకాంత్ చిత్రం కూడా..!