తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గం రెండేళ్ల పదవీకాలం పూర్తయినందున, సెప్టెంబర్ 8న నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోడానికి ఎన్నికలు నిర్వహించాలని ఛాంబర్ సభ్యులు నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్ స్థాపించి 14ఏడ్లయింది.
వెయ్యిమంది నిర్మాతలతోపాటు 24 శాఖలకు చెందిన 16వేలమంది ఈ ఛాంబర్లో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే సభ్యులందరికీ ఇన్సూరెన్స్, సభ్యుల పిల్లలకు స్కాలర్షిప్లు అందిస్తున్నాం. సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఛాంబర్ పాలకవర్గ పదవీకాలం పూర్తయింది.
కావున ఎన్నికలకు వెళ్తున్నాం. సెప్టెంబర్ 1 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. సెప్టెంబర్ 8న ఎన్నికలు నిర్వహిస్తాం. సభ్యులందరూ తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.’ అని కోరారు.