తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హను-మాన్’. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నదని, సుశిక్షితులైన నిపుణుల బృందం వీఎఫ్ఎక్స్ పనుల్లో పాలుపంచుకుంటున్నారని చిత్ర బృందం తెలిపింది. ‘హనుమాన్ టీజర్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది.
ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి. అవి ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి’ అని నిర్మాతలు పేర్కొన్నారు. అంజనాద్రి అనే ఊహాత్మక ప్రపంచంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. కథానాయకుడు హనుమంతుడి శక్తులు పొంది దుష్ట శిక్షణ ఎలా చేశాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్యరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: గౌరహరి, అనుదీప్‌దేవ్, కృష్ణసౌరబ్, స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్‌విల్లే, నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: ప్రశాంత్‌వర్మ.