టాలీవుడ్ (Tollywood) యువ హీరో తేజ సజ్జా (Teja Sajja) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు అద్బుతం (Adbhutham). మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివానీ రాజశేఖర్ (Shivani Rajashekar ) హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తూ…కొత్త అప్డేట్ను మేకర్స్ అందించారు. అద్బుతం చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో విడుదల చేయనున్నారు.
డిస్నీ+హాట్‌స్టార్ (Disney+ Hotstar)లో నవంబర్ 19న గ్రాండ్‌గా ప్రీమియర్ కాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న అద్బుతం చిత్రానికి ప్రశాంత్ వర్మ కథనందించాడు.
అద్భుతం ట్రైలర్‌పై ఓ లుక్కేయండి..
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న అఖండ పోస్ట్ థియాట్రికల్ డిజిటల్ రైట్స్ ను కూడా డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకోవడం విశేషం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు తేజ సజ్జా. ఈ కుర్ర హీరో ఈ ఏడాది జాంబిరెడ్డి, ఇష్క్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వీటిలో జాంబిరెడ్డి చిత్రానికి మిశ్రమ స్పందన రాగా..ఇష్క్ డిజాస్టర్ గా నిలిచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!