అగ్ర హీరో రవితేజ ప్రస్తుతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాత సుధాకర్ చెరుకూరి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ సినిమా చేస్తారు రవితేజ.
పనిలోపనిగా ఆ తర్వాత సినిమాను కూడా లైన్లో పెట్టేందుకు కథలు వినేస్తున్నారాయన. రీసెంట్గా బింబిసార, విశ్వంభర చిత్రాల దర్శకుడు వశిష్ట ఆయన్ను కలిసి ఓ కథ వినిపించారట. ఇది సైన్స్ఫిక్షన్తో కూడుకున్న కథ అని సమాచారం. రవితేజ మార్క్ వినోదంతోపాటు కాస్తంత వైవిధ్యాన్ని కూడా జోడించి వశిష్ట తయారు చేసుకున్న ఈ కథ రవితేజకు కూడా బాగా నచ్చిందట. అందుకే ఆయనే నిర్మాతను కూడా సెట్ చేస్తారని ఫిల్మ్ వర్గాల భోగట్ట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.