Akhanda 2 | నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2’ (తాండవం). బ్లాక్ బస్టర్ సినిమా ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర యూనిట్ జార్జియాలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జార్జియా షెడ్యూల్‌ని కూడా చిత్రబృందం పూర్తి చేసుకున్నట్లు సమాచారం. జార్జియా షెడ్యూల్ అనంతరం అఖండ టీమ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక ఎపిసోడ్లను చిత్రీకరించబోతుంది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా, యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నారు. బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 25న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Read More