వాషింగ్టన్: అమెరికా టీవీ నటుడు జో లారాతో పాటు ఆయన భార్య, మొత్తం ఏడు మంది కుటుంబసభ్యులు దురదృష్టకరరీతిలో విమాన ప్రమాదంలో మరణించారు. చిన్నపాటి బిజినెస్ జెట్ విమానంలో టెన్నిస్సీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి సమీపంలో ఉన్న సరస్సు వద్ద ఆ విమానం కూలిపోయింది. 1980, 1990 దశకంలో అమెరికా టీవీ సిరీస్‌లో ప్రసారం అయ్యిన టార్జన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఆ సిరీస్‌ల్లో జో లారా టార్జన్ పాత్ర పోషించాడు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ఏడు మంది ఉన్నారు. నటుడు జో లార్తో పాటు ఆయన భార్య గ్వెన్ షాంబ్లిన్ లారా ఉన్నారు. డైట్ గురూగా ఆమె చాలా ఫేమస్. విమానం టేకాఫ్ తీసుకున్ తర్వాత నాష్విల్లీ వద్ద ఉన్న పెర్సీ ప్రీస్ట్ లేక్‌లో కుప్పకూలింది. అందులో ఉన్నవారంతా మరణించినట్లు ఫెడరల్ విమానశాఖ తెలిపింది. 1989లో వచ్చిన టార్జన్ ఇన్ మన్హటన్ టెలివిజన్ మూవీలో జో లారా ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత టార్జన్-ద ఎపిక్ అడ్వెంచర్స్ సిరీస్‌లోనూ టార్జన్ పాత్ర పోషించాడు. ఈ సిరీస్ రెండేళ్ల పాటు కొనసాగింది.