ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu). ఈ హీరో నెక్ట్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)తో SSMB 28 షురూ చేయబోతున్నాడు. కాగా ఈ చిత్రంలో నందమూరి హీరో తారకరత్న (Nandamuri Taraka Ratna) కీ రోల్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తారకరత్న టీం దీనిపై క్లారిటీ ఇచ్చినట్టు అప్ డేట్ వచ్చింది.
తారకరత్నకు ఎలాంటి ట్విటర్ ఖాతా లేదని టీం వెల్లడించింది. అంతేకాదు తారకరత్నకు సంబంధించిన మూవీ అప్ డేట్స్ ఏమైనా ఉంటే కేవలం తన పీఆర్ టీం నుంచి మాత్రమే వస్తుందని, నెటిజన్లు ఎలాంటి ఫేక్ వార్తలు వ్యాప్తి చేయొద్దని కోరింది టీం. ప్రస్తుతం తెలుగు వెబ్ సిరీస్ ‘9 హవర్స్’ లో నటిస్తున్నాడు. జూన్ 2న డిస్నీ+హాట్ స్టార్లో ప్రీమియర్ కానుంది.
గతేడాది పొలిటికల్ లీడర్ దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా తెరకెక్కిన దేవినేని చిత్రంలో లీడ్ రోల్లో నటించాడు తారకరత్న. వెబ్ సిరీస్ తర్వాత తెలుగులో ఎలాంటి సినిమా చేయబోతున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు.