Tanushree Dutta | బాలీవుడ్ నటి తనుశ్రీదత్తా (Tanushree Dutta) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మోడల్ రంగంలో ఫెమినా మిస్ ఇండియా గా 2005 పేరు తెచ్చుకున్న ఈ భామ తర్వాత ఆషిక్ బనాయా ఆప్నే (Aashiq Banaya Aapne) సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం అంతా హిట్ కాకపోయిన ఇందులో వచ్చిన ఆషిక్ బనాయా ఆప్నే పాట మాత్రం అప్పట్లో ఫుల్ వైరల్గా మారింది. ముఖ్యంగా పాటలో ఇమ్రాన్ హష్మీ, తనుశ్రీ దత్తా కెమెస్ట్రీ మాత్రం మాములుగా వర్క్ అవుట్ అవ్వలేదు. పాటలో ముద్దు సన్నివేశాలు చిత్రీకరించడం అప్పట్లో బాలీవుడ్లో చర్చకు దారి తీసింది. అయితే ఈ పాట ప్రశంసలతో పాటు విమర్శలు ఎదుర్కోన్న విషయం తెలిసిందే. అయితే ఈ పాటపై ఉన్న వివాదంపై తాజాగా తనూశ్రీ దత్తా స్పందించింది.
ఆషిక్ బానాయా పాట గురించి మాట్లాడుతూ.. ఇమ్రాన్ హష్మీతో నేను దాదాపు మూడు చిత్రాల్లో నటించా. ‘ఆషిక్ బనాయా ఆప్నే’ మా కాంబోలో వచ్చిన తొలి చిత్రం. అందులో మా ఇద్దరిపై రొమాంటిక్ సీన్స్ చిత్రీకరించారు. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలా విమర్శలు ఎదుర్కోన్నాను. రోమాంటిక్ సన్నివేశాలు, ముద్దు సీన్స్ బాలీవుడ్లో చాలా పెద్ద హీరోలే చేశారు. కానీ వాళ్లను ఇప్పటివరకు ఏమి అనలేదు. కానీ నేను ఆషిక్ బానాయాలో అలా కనిపించేసరికి అందరికి సమస్య వచ్చింది. నేను అది నా ఇష్టంతోనే చేశాను. అలాగే నాకు ఇమ్రాన్ హష్మీకి మధ్య ఎలాంటి పర్సనల్ రిలేషన్ షిప్ లేదు. మీడియా అలాంటివి క్రియేట్ చేసి కావాలని ప్రచురించింది. ఇమ్రాన్ హష్మీతో నాకు బ్రదర్ లాంటి రిలేషన్ ఉంది అని తెలిపింది.
అయితే ఈ వ్యాఖ్యలపై ఇమ్రాన్ హష్మీ తాజాగా స్పందిస్తూ.. తాను ఎలా చెప్పిందో తనకు అర్థం కాలేదని దీనిపై ఎక్కువ స్పందించలేనని తెలిపాడు. ఇక తనుశ్రీ దత్తా తెలుగులో బాలయ్యతో కలిసి వీరభద్ర సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు రాలేవు.
Also read..