తమిళనాడులో సినిమా టికెట్ రేట్లు తగ్గనున్నాయి. అక్కడి లోకల్‌బాడీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్‌ను తగ్గించడమే ఇందుక్కారణం. ప్రస్తుతం 8.6 శాతం ఉన్న వినోదపు పన్నును 4 శాతానికి తగ్గిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 5న విడుదలకాబోతున్న కమల్‌హాసన్ ‘థగ్‌లైఫ్’ చిత్రానికి టికెట్ రేట్లు తగ్గబోతున్నాయి. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్‌ను తగ్గించడం గొప్ప నిర్ణయమని, సామాన్యులకు సిని మా మరింత చేరువవుతుందని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా తమిళనాడు ఓ ప్రకటనలో తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది.
కొద్ది రోజుల క్రితమే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్‌ను తగ్గించాలని కమల్‌హాసన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ ఆర్థికంగా సతమతమవుతున్న దృ ష్ట్యా పరిశ్రమను ఆదుకోవాలని కమల్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభు త్వం వినోదపు పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణ యం థియేటర్లలో ఆక్యుపెన్సీని పెంచడానికి దోహదపడుతుందని, తద్వారా పరిశ్రమకు మేలు జరుగుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.