Tamil Nadu CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి మంగళూరు చేరుకున్నారు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం విజయ్, అక్కడి నుంచి ఉడిపి జిల్లాలోని ప్రసిద్ధ కొల్లూరు శ్రీ మూకాంబిక దేవి ఆలయానికి వెళ్లనున్నట్లు సమాచారం.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దక్షిణ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు విజయ్. ఇక గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఈ ఆలయాన్ని దర్శించుకుని, సుమారు కిలో బరువు, 2.5 అడుగుల పొడవు గల ఖడ్గాన్ని కానుకగా సమర్పించారు. ఆ ఖడ్గాన్ని ప్రస్తుతం ఆలయంలో ప్రత్యేక పూజల సమయంలో ప్రదర్శిస్తుంటారు. మరోవైపు సీఎం విజయ్ పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.