Tamannah |టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకి ఫిట్‌నెస్‌పై ఎంత ప్రత్యేక శ్రద్ధ ఉందో మరోసారి నిరూపించింది. ‘శ్రీ’ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టి, ‘హ్యాపీ డేస్’ చిత్రంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన తమన్నా, అందం మరియు అభినయంతో టాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా స్థిరపడింది. ఇండస్ట్రీకి అడుగుపెట్టి దాదాపు 18 ఏళ్లు అయినా, తమన్నా ఇప్పటికీ స్టార్ స్టేటస్‌ను కొనసాగిస్తోంది. ఈ వయస్సులోను ఆమె ఫిట్నెస్ లెవెల్ చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు.
ఇటీవల ఆమె స్పెయిన్‌లో సెలవులు ఎంజాయ్ చేస్తోంది. అయితే సెలవుల్లో కూడా ఫిట్‌నెస్‌పై ఎలాంటి రాజీ పడకుండా, జిమ్‌లో చెమటోడుస్తూ కనిపించింది.తమన్నా ట్రైనర్ సిద్ధార్థ్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, బ్లాక్ జిమ్ అవుట్‌ఫిట్‌లో తమన్నా కసరత్తులు చేస్తూ కనిపించింది. డంబెల్స్ ఎత్తుతూ, కఠినమైన వర్కౌట్స్ చేస్తూ తన డెడికేషన్‌ను చూపించింది. “ఎక్కడ ఉన్నా సరే జిమ్ చేయడం మానను” అనే తమన్నా కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అసలు తమన్నా రోజువారీ ఫిట్నెస్ రొటీన్ చాలా కఠినంగా ఉంటుంది. బరువులు ఎత్తడం, అబ్స్ వ్యాయామాలు, పంచెస్, కార్డియో వర్కౌట్స్‌తో పాటు ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్లు కూడా ఆమె దినచర్యలో భాగమే. జిమ్‌కు వెళ్లలేని రోజుల్లో యోగా లేదా ఈతకు వెళ్తుందని ఆమె చెప్పుకొచ్చింది.
ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. “ఉదయం నాలుగు గంటలకే లేచి వ్యాయామం మొదలుపెడతాను. ఫిట్‌గా ఉండడం అంటే కేవలం అందం కోసం కాదు, అది జీవనశైలి భాగం” అని చెప్పింది. ఆమె ట్రైనర్ కూడా “తమన్నా వర్కౌట్స్ తీవ్రంగా ఉంటాయి. ఆమె ఆహారపు అలవాట్లు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి” అని పేర్కొన్నారు. మొత్తానికి, స్పెయిన్‌లో సెలవులు ఎంజాయ్ చేస్తూనే జిమ్‌లో చెమటోడుస్తున్న తమన్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిట్నెస్ విషయంలో తమన్నా చూపిస్తున్న అంకితభావం, అందరికీ నిజమైన ప్రేరణగా మారుతోంది.