Tabu | తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది టబు. ఈ హైదరాబాదీ భామ తనదైన మార్క్ యాక్టింగ్‌తో బాలీవుడ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది. టబు, అజయ్ దేవ్గన్ (Ajaydevgn)తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం Auron Mein Kahan Dum Tha. నీరజ్‌పాండే రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
టబు, అజయ్ దేవ్గన్ మధ్య సాగే రొమాంటిక్, భావోద్వేగపూరిత సన్నివేశాలతో ఇంట్రెస్టింగ్గా సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. Special 26, టాయ్ లెట్ ఏక్ ప్రేమకథా, ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన నీరజ్ పాండే మరో రొమాంటిక్ ట్రాక్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం పక్కా అని ట్రైలర్ చెబుతోంది.
2000-2023 మధ్య కాలంలో సాగే రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో సినిమా రాబోతుంది. ఎన్‌హెచ్ స్టూడియోస్ సమర్పణలో ఏ ఫ్రైడ్ ఫిల్మ్ వర్క్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శాంతను మహేశ్వరి, జిమ్మీ షేర్గిల్, బెనెడిక్ట్ గర్రెట్, సయీ మంజ్రేకర్‌తోపాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
AJAY DEVGN – TABU: ‘AURON MEIN KAHAN DUM THA’ TRAILER IS HERE… NEERAJ PANDEY PENS SPECIAL NOTE… 5 JULY RELEASE… #AjayDevgn and #Tabu reunite for director #NeerajPandey’s #AuronMeinKahanDumTha [#AMKDT].#AMKDTTrailer 🔗: https://t.co/s3gTtfoLre
A romantic drama set between… pic.twitter.com/G3s5BYoYAH
— taran adarsh (@taran_adarsh) June 13, 2024