బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ( Biggboss Season 5 Telugu) గతంలో ఎన్నడూ లేని విధంగా స్పైసీగా మారుతోంది. షో ప్రారంభంలో కాస్త బిగువుగా కనిపించిన హౌస్ మేట్స్ ఇప్పుడు ఒకరికొకరు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. తొలివారం సరయు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా, రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపైనే ఇపుడు అంతటా చర్చ నడుస్తోంది. న
‘బిగ్ బాస్’ ప్రయాణంలో కేవలం ఏడు రోజుల్లోనే, రెండో రోజు నామినేషన్లకు చేరుకుంది. కంటెస్టెంట్స్ ను ‘ఈగిల్’ (Eagle Team) , ‘వోల్ఫ్’ (Wolf Team ) టీంలుగా విడగొట్టాడు బిగ్ బాస్. వోల్ఫ్ టీం సభ్యులుగా లహరి శారీ, జెస్సీ, రవి, సన్నీ, శ్వేతావర్మ, నటరాజ్, కాజల్, ఉమాదేవిని ఎంపిక చేశారు. ఈగిల్ టీంలో యానీ, లోబో, శ్రీరామచంద్ర, ప్రియా, హమీద, ప్రియాంకా సింగ్, విశ్వ, షణ్ముఖ్,సిరిలను ఎంపిక చేశారు.
ఏడో ఎపిసోడ్ లో కొన్ని యానిమేటెడ్ సన్నివేశాలు ఉన్నాయి. ఇక హౌస్ నుంచి ఎలిమినేషన్ కోసం తనను నామినేట్ చేసిన వారిపై శ్వేతా వర్మ (Swetha Varma) కోపాన్ని ప్రదర్శించింది. నకిలీ భావోద్వేగాలు, భావాలను వ్యక్తపరిచిన హమీదా, లోబోలను నకిలీ స్నేహితులుగా అభివర్ణించింది శ్వేతావర్మ. తాను హౌస్మేట్లతో స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ…తనకు ఇంట్లో జరిగిన విషయాన్ని నమ్మలేకపోయింది.
మరోవైపు లహరి శారీ (Lahari Shari) ఇంటి సభ్యులతో నామినేట్ చేయబడిన దశను దాటేసింది. రెండవ రౌండ్లో ఆమెను ఏ కంటెస్టెంట్ నామినేట్ చేయలేదు. లహరి ఆటలో కొనసాగుతున్నపుడు అవకాశాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తుంది. షణ్ముఖ్, జస్వంత్, సిరి వంటి మంచి ఆటగాళ్లున్నా..లహరి మాత్రం ఆట బాగా తెలిసిన వ్యక్తి. హౌస్‌లోని ఇతర సహచర కంటెస్టెంట్ల మనోభావాలు దెబ్బతీయలేదు. ప్రస్తుతం నామినేషన్లో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, అనీ మాస్టర్, ప్రియ ఉన్నారు.
Vijay Deverakonda | బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ..లైగర్ స్టిల్ వైరల్
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!