శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందిన యునిక్ ఎంటైర్టెనర్ ‘స్వాగ్’. ‘రాజ రాజ చోర’ ఫేం హసిత్ గోలి దర్శకుడు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘1551 నుంచి మగవాడి ప్రయాణం’ అంటూ ట్రైలర్ మొదలైంది. ఈ రాజవంశానికి చెందిన ఏకైక వారసుడైన సింగాకు రాజవంశం తాలూకు నిధిని అప్పగించడం అదే వంశానికి చెందిన భవభూతి బాధ్యతగా భావిస్తాడు. అయితే.. వింధ్యామర రాణి దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో కథ సాగుతుందని ట్రైలర్ చెబుతున్నది. జెండర్ గేమ్స్‌ని ట్రైలర్లో ఆసక్తిగా దర్శకుడు ప్రజెంట్ చేశారు. శ్రీవిష్ణు నాలుగు గెటప్పుల్లో కనిపించారు. ఆయన బాడీలాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్, అన్నీ వైవిధ్యంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. రీతూవర్మ, మీరా జాస్మిన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: వేదరామన్ శంకరన్, సంగీతం: వివేక్‌సాగర్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల.