‘కొత్త కంటెంట్‌ని ఆడియన్స్ ఆదరిస్తారన్న నమ్మకంతో చేసిన సినిమా ‘స్వాగ్’. అనుకున్నట్టే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా నా కేరక్టర్లు, గెటప్స్‌కి మంచి స్పందన వస్తున్నది. పొద్దున్నుంచీ ఈ సినిమా తాలూకు అభినందనలను అందుకుంటూనే ఉన్నా. ఆడియన్స్‌కి ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే సినిమా ‘స్వాగ్’ ’ అని హీరో శ్రీవిష్ణు చెప్పారు. ఆయన హీరోగా రూపొందిన ఎమోషనల్ ఎంటైర్టెనర్ ‘స్వాగ్’. రీతువర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మీరాజాస్మిన్ ప్రత్యేక పాత్ర పోషించారు. హసిత్ గోలి దర్శకుడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ని నిర్వహించారు. దర్శకుడు హసిత్ గోలీ మాట్లాడుతూ ‘కథలోని కొత్త విషయాలను హత్తుకునేలా చెప్పాం. ఆడియన్స్ రెస్పాన్స్ మా కష్టాన్ని మరిచిపోయేలా చేసింది. శ్రీవిష్ణు నటన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కథను, హీరోను నమ్మి అన్ని విధాలుగా మాకు సహకరించిన విశ్వప్రసాద్‌గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా’ అన్నారు. ఎక్కువకాలం గుర్తిండిపోయే సినిమా అని నమ్మే ‘స్వాగ్’ తీశామని, అన్ని చోట్లా అద్భుతమైన స్పందన వస్తున్నదని నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ తెలిపారు. ఇంకా కథానాయికలు రీతూవర్మ, దక్ష నగార్కర్ కూడా మాట్లాడారు.