Saripodhaa Sanivaaram | న్యాచురల్ స్టార్ నాని (Nani) రీసెంట్గా సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో హిట్ అందుకున్నాడని తెలిసిందే. ప్రస్తుత ఈ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు కొత్త సినిమాల షూటింగ్స్‌తో బిజీగా మారిపోయాడు. కాగా థియేటర్లలో అందరినీ ఇంప్రెస్ చేసిన ఈ చిత్రం ఓటీటీలో కూడా పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాంలో సెప్టెంబర్ 26 ఉంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రం ఓటీటీలో డెబ్యూ ఇవ్వనున్న నేపథ్యంలో ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది. సరిపోదా శనివారం నుంచి జేక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన (ఓఎస్టీ) ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను విడుదల చేసింది. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని ఎలివేట్ చేయడంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీ రోల్ పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓఎస్టీని విని మీరూ ఎంజాయ్ చేయండి మరి.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని 31గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా.. ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో రిలీజయింది. ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా.. కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటించాడు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు.
His third eye is about to open, and you’re not ready for what’s coming. 🔥#SaripodhaaSanivaaram is coming to Netflix on 26 September in Hindi, Telugu, Tamil, Malayalam and Kannada! #SuryasSaturday pic.twitter.com/OTQBRiik6W
— Netflix India (@NetflixIndia) September 24, 2024
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి
Rathnavelu | దేవరలో జాన్వీకపూర్ కనిపించేది అప్పుడేనట.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్