తమిళ అగ్ర హీరో సూర్య దృష్టంతా ప్రస్తుతం తెలుగు దర్శకుల మీదే ఉంది. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నది. ఓవైపు ఈ సినిమా చేస్తూనే మరోవైపు ఇంకో తెలుగు దర్శకుడి కథను కూడా ఓకే చేశారట సూర్య. ఆ దర్శకుడెవరోకాదు. ‘వివేక్ ఆత్రేయ’. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికీ!, సరిపోదా శనివారం సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు వివేక్ ఆత్రేయ.
ముఖ్యంగా నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘సరిపోదా శనివారం’ సినిమా వందకోట్ల విజయాన్ని అందుకున్నది. ఆ సినిమా తర్వాత ఆయన రజనీకాంత్‌తో సినిమా చేస్తారని కూడా వార్తలొచ్చాయి. ప్రస్తుతం చెన్నై సమాచారం ప్రకారం సూర్యకు రీసెంట్గా వివేక్ కథ వినిపించారట. ఓ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని తెలుస్తున్నది.