Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రయోగాత్మక చిత్రం కంగువ (Kanguva). సూర్య 42వ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీకి శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడులవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అండ్ సూర్య టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా సూర్య చిట్ చాట్‌లో ఆసక్తికర విషయం చెప్పి అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు.
కమల్ హాసన్ టైటిల్ రోల్లో నటించిన విక్రమ్ సినిమా ఏ రేంజ్లో హిట్‌గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విక్రమ్‌లో ఏ పాత్రకు రానంత భారీ రెస్పాన్స్ రోలెక్స్‌కు వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రోల్‌కి పూర్తిస్థాయి సినిమా కూడా వచ్చే అవకాశాలున్నాయంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే టాపిక్ గురించి మాట్లాడాడు సూర్య.
విక్రమ్‌లో పాపులర్ అయిన రోలెక్స్ పాత్ర గురించి చెప్పాడు సూర్య. రోలెక్స్ లాంటి చిన్న కామియో పాత్రకు ఇంత భారీ స్థాయిలో స్పందన వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. కేవలం హాఫ్ డేలో రోలెక్స్ పాత్రను షూట్ చేశాం. రోలెక్స్ పాత్ర ఐకానిక్‌గా నిలిచిపోతుందని అనుకోలేదు. రోలెక్స్‌ను కల్ట్ క్యారెక్టర్‌గా మార్చిన క్రెడిట్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కే దక్కుతుందన్నాడు. తాను రాబోయే కాలంలో పూర్తి స్థాయి రోలెక్స్ పాత్రలో కనిపించాలని వెయిట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు సూర్య. ఇంకేంటి మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు లోకేశ్ కనగరాజ్ కథ రెడీ చేయడమే తరువాయి అని సూర్య కామెంట్స్ చెప్పకనే చెబుతున్నాయి.
లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం రజినీకాంత్‌తో కూలీ సినిమా చేస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది. సూర్య ఖాతాలో సూర్య 43, కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో చేస్తున్న సూర్య 44, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో చేయబోతున్న సూర్య 45 ప్రాజెక్టులున్నాయి.
War 2 | హృతిక్ రోషన్ వర్సెస్ తారక్ .. వార్ 2లో అదిరిపోయే కత్తిసాము సీక్వెన్స్