Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం కంగువ (Kanguva). శివ (Siva) దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్య సినిమాగా విడుదలైంది. నవంబర్ 14న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతోపాటు వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా కంగువ డిజిటల్ స్ట్రీమింగ్కు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తాజా టాక్ ప్రకారం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కంగువ డిసెంబర్ 12న ప్రీమియర్ కానుంది. అంటే థియేటర్లలోకి వచ్చిన నెల రోజులకు ఓటీటీలోకి రాబోతుందన్నమాట. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లలో మిస్సయిన ప్రేక్షకులు కంగువను ఇక ఓటీటీలో చూసేయొచ్చన్నమాట.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కించాయి. ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
🦅🔥#Suriya’s blockbuster #Kanguva is all set to stream on Amazon Prime Video from Dec 12🎬✨#SiruthaiSiva | #DishaPatani | #BobbyDeol pic.twitter.com/Z0vvj1v1Qr
— Kollywood Now (@kollywoodnow) December 3, 2024
Rishab Shetty | శివాజీ మహారాజ్‌గా కాంతార హీరో.. రిషబ్ శెట్టి స్టన్నింగ్ లుక్ వైరల్
Allu Arjun | ఐదేళ్ల నుంచి ఒకే హీరోయిన్ : పుష్ప 2 ది రూల్ ఈవెంట్లో అల్లు అర్జున్