Suriya 42 | మెరుపుల మధ్య యోధుడి ఎంట్రీ.. సూర్య 42 టైటిల్ అనౌన్స్మెంట్ టైం ఫిక్స్
సూర్య (Suriya) పీరియాడిక్ ప్రాజెక్ట్ సూర్య 42 (Suriya 42) అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా సూర్య టీం శుభవార్త అందించింది. సూర్య 42 టైటిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఉండబోతుందో తెలియజేస్తూ.. మేకర్స్ కొత్త లుక్ ఒకటి విడుదల చేశారు.
Suriya 42 | స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం పీరియాడిక్ ప్రాజెక్ట్ సూర్య 42 (Suriya 42)తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా సూర్య టీం శుభవార్త అందించింది. సూర్య 42 టైటిల్ అనౌన్స్ మెంట్ ఏప్రిల్ 16న ఉదయం 9:05 గంటలకు ఉండబోతుందని తెలియజేస్తూ.. మేకర్స్ కొత్త లుక్ ఒకటి విడుదల చేశారు.
యోధుడు ఉరుములు, మెరుపుల మధ్య కదనరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు.. అంటూ లాంఛ్ చేసిన లుక్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతున్నట్టు తాజా స్టిల్‌తో అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సూర్య 42 ప్రాజెక్ట్ 2డీ, 3డీ ఫార్మాట్లలో 10 భాషల్లో విడుదల కానుంది.
సూర్యకు అదిరిపోయే బ్లాక్ బస్టర్ సాంగ్స్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే చాలా రోజుల క్రితం విడుదల చేసిన సూర్య 42 లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. సూర్య మరోవైపు అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్న సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Warrior enters across the showers of glory and trumpets of Thunderstorms!
Get ready to welcome #Suriya42 Title Announcement on April 16, at 9.05 a.m. 🎉
A Mighty Valiant Saga In 10 Languages 🔥@Suriya_offl @DishPatani @directorsiva @StudioGreen2 @kegvraja @UV_Creations pic.twitter.com/phbLWp2pOz
— Ramesh Bala (@rameshlaus) April 11, 2023
Read Also :
Virupaksha Trailer | ఎవరికైనా చావుకెదురెల్లే దమ్ముందా..? సస్పెన్స్‌గా విరూపాక్ష ట్రైలర్
Shaakuntalam | సమంత శాకుంతలం సెన్సార్ అప్డేట్.. రన్‌టైం ఎంతో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

