NTR 31 | ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా వచ్చి 2 ఏండ్లు గడుస్తున్న ఎన్టీఆర్ సినిమా ఒక్కటి కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తారక్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్తో సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఎన్టీఆర్ 31 (NTR 31)గా రానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మేకర్స్ పోస్టర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ క్రేజీ కాంబో షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా..ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్లు వస్తాయా అని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ మే 20 రానున్నట్లు తెలుస్తుంది. ఆరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. కాగా తారక్ పుట్టినరోజు నాడు అప్డేట్ ఇస్తే.. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చిత్రయూనిట్ ఆలోచిస్తునట్లు సమాచారం. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా నుంచి కూడా మే 20తేదీన అప్డేట్ వస్తున్నట్లు తెలుస్తుంది.