మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లీడ్ రోల్ లో నటిస్తోన్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు లూసిఫర్ తెలుగు రీమేక్ (Lucifer remake). ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించిన సుప్రీమ్ అప్డేట్ ను మేకర్స్ విడుదల చేశారు. చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) Chiru birthday సందర్భంగా రేపు సాయంత్రం 5.04 గంటలకు సుప్రీమ్ రివీల్ ఉండబోతుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో బర్త్ డేన చిరు ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారని పండగ చేసుకుంటున్నారు మెగా అభిమానులు.
అయితే టైటిల్ ప్రకటన కూడా ఉంటుందా..? లేదా..? అనే విషయంపై రేపు స్పష్టత రానుంది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి 153వ ప్రాజెక్టుగా వస్తోంది ఈ చిత్రం. రాంచరణ్ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. గాడ్ ఫాదర్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాక్. కాగా బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కీ రోల్ పోషిస్తున్నాడు.
వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్ నటిస్తుండగా..అతని భార్యగా నయనతార నటించబోతుంది. ఒరిజినల్ వెర్షన్ లో మంజువారియర్ పోషించిన పాత్రలో నయనతార మెరవనుంది.
Get ready for the #SupremeReveal of Mega Star @KChiruTweets' #Chiru153 tmr at 5:04PM
— BA Raju's Team (@baraju_SuperHit) August 20, 2021
Stay tuned for the MEGA Bonanza !
Let's celebrate the birthday of Mega Star in style.@jayam_mohanraja @AlwaysRamCharan #RBChoudary @ProducerNVP @KonidelaPro @SuperGoodFilms_ @MusicThaman pic.twitter.com/oiR4RiYeSN
ఇవికూడా చదవండి..
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!