Dhanush-Aishwarya divorce | తమిళ స్టార్ హీరో ధనుష్ విడాకుల ప్రకటన కేవలం కోలీవుడ్‌నే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 18 ఏండ్ల దాంపత్య జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నట్లు తెలిసి ఎవరూ నమ్మలేకపోయారు. వీరిద్దరూ కలిసి పోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని సోషల్‌మీడియా వేదికగా కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి కాపురాన్ని చక్కదిద్దేందుకు సూపర్‌స్టార్ రజినీకాంత్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కోలీవుడ్ మీడియాతో మాట్లాడిన ధనుష్ తండ్రి కస్తూరి రాజా.. భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణమని చెప్పాడు. ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తొందరలోనే కలిసిపోతారని పేర్కొన్నాడు. ఇద్దరికీ నచ్చజెప్పేందుకు తాను ప్రయత్నిస్తున్నానని.. రజినీ కూడా విడాకుల నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వారిద్దరినీ కోరారని తెలిపాడు. అయితే కూతురు, అల్లుడు దూరం కావడం ఇష్టం లేని సూపర్‌స్టార్ రజినీకాంత్ ఫోన్లో ఐశ్వర్య, ధనుష్‌లతో వేర్వేరుగా మాట్లాడారు. అసలు వీరిద్దరి మధ్య ఏ విషయంలో మనస్పర్థలు వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అయినా ఇద్దరూ కలిసిపోవాలని కోరారట. మరి రజినీ మాటను గౌరవించి వీరిద్దరూ కలిసిపోతారో లేదో చూడాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నామని ప్రకటించినా ఇంకో అధికారికంగా విడాకులు మాత్రం తీసుకోలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Dhanush Biopic | ధనుష్‌కు ఈ ఇద్దరి బయోపిక్‌లలో నటించాలని ఉందట..!
తెలుగు దర్శకులు.. తమిళ హీరోలు.. రొంబ కాంబినేషన్ అప్ప..