తెలుగు దర్శకులు.. తమిళ హీరోలు.. రొంబ కాంబినేషన్ అప్ప..

Tamil Heroes | నిన్న మొన్నటి వరకు తెలుగు హీరోలు ఎక్కువగా తమిళ దర్శకుల వెంట పడేవాళ్లు. అంతే కాదు తమిళ హీరోలు వచ్చి తెలుగు దర్శకులతో సినిమాలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఒకప్పుడు కె.విశ్వనాథ్ లాంటి లెజెండరీ దర్శకులు కమల్‌హాసన్ హీరోగా స్ట్రెయిట్ సినిమాలు చేశాడు. ఆ తర్వాత బాలచందర్, బాలు మహేంద్ర లాంటి దర్శకులు మాత్రమే తెలుగు హీరోలతో సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగు దర్శకులు వరుసగా తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మన దర్శకులు చెబుతున్న కథలకు అరవ హీరోలు ఫిదా అవుతున్నారు.
డబ్బింగ్ సినిమాలతో దండయాత్ర చేసిన తమిళ హీరోలు.. ఇప్పుడు స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు. ఒకరు ఇద్దరు కాదు చాలా మంది హీరోలు నేరుగా తెలుగు ఇండస్ట్రీపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో సినిమా కన్ఫర్మ్ అయింది. అంతలోనే మరో సినిమా కూడా మొదలు పెట్టాడు ధనుష్. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. ధనుష్ హీరోగా సార్ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మించబోతోంది. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఈ సినిమాకు మరో నిర్మాత కావడం గమనార్హం.
కేవలం ధనుష్ మాత్రమే కాదు శివ కార్తికేయన్ కూడా త్వరలోనే తెలుగు దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్‌తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు శివ కార్తికేయన్. జనవరి 1న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వచ్చింది. విజయ్, వంశీ పైడిపల్లి సినిమా కూడా 2023లో విడుదల కానుంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం వీళ్లు మాత్రమే కాదు.. మరికొందరు తమిళ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మన హీరోలు కూడా తక్కువ తినలేదు. నేరుగా తమిళ ఇండస్ట్రీపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
2021లో సక్సెస్ ఫుల్ డెబ్యూ చేసిన హీరోలు వీళ్లే..
Samantha item song | టాప్ ఫామ్‌లో ఉన్నపుడే ఐటమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే.
వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే..
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

