బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్‌గా 10 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే 10 మంది కంటెస్టెంట్స్ బయటకు వెళ్లగా, హౌజ్‌లో 9 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో ఎవరు టాప్ 5లో ఉంటారనే చర్చ జోరుగా నడుస్తుంది. అయితే 72వ ఎపిసోడ్లో 11వ వారం నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. హౌజ్‌మేట్స్ పాత విషయాల గురించి చెబుతూ ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేశారు.
శని, ఆదివారం ఎపిసోడ్స్‌లో తనకు జరిగిన అన్యాయం గురించి తెగ బాధపడ్డాడు సన్నీ. రవి అవకాశ వాది ఎటు వీలు ఉంటే అటు మాట్లాడతాడు.. కొడతా.. తన్నుతా.. అద్దం నుంచి అవతల పడతారు లాంటివి.. ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు వస్తుంటాయి. వాటిని కూడా పాయింట్‌గా లేవనెత్తాడు. సడెన్‌గా నేను బ్యాడ్ బిహేవియర్ అని గుర్తుకువచ్చింది అని చెబుతూ బాధపడ్డాడు.
ఇక సిరి, షణ్ముఖ్.. సన్నీ గురించే మాట్లాడుకున్నారు. ఇక హౌస్‌లో ఉన్న వాళ్లకి నటరాజ్ మాస్టర్ లాగే జంతువులతో పోల్చాడు సన్నీ. ఆనీ మాస్టర్ అయితే ఖచ్చితంగా పాము అని అన్నాడు. రవికి ఏ జన్మకైనా నటరాజ్ మాస్టర్ ఇచ్చిందే కరెక్ట్ గుంట నక్కకి సరిపోతాడు అని పేర్కొన్నాడు. సిరి అయితే కట్లపాము.. షణ్ముఖ్ అయితే నల్ల నక్క.. నాకు నేను పేరు పెట్టుకోవాలంటే చింపాంజీ అని పేర్లు పెట్టాడు.