Sunny Deol | బాలీవుడ్ నుంచి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లలో ఒకటి ‘రామాయణ’(Ramayana). దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రం 45కి పైగా భాషల్లో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటించబోతుండగా.. సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తుంది. రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే తదితరులు నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు నటుడు సన్నీడియోల్.
ఈ చిత్రంలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోల్ చాలా సరదాగా అల్లరిగా ఉండడంతో పాటు ఉత్సహాంగా ఉంటుందని సన్నీ తెలిపాడు. నా పాత్రకు సంబంధించి త్వరలోనే షూటింగ్ ప్రారంభంకానుంది. ఇలాంటి పాత్రలు చాలా సవాలుతో కూడుకున్నవని అందులో పూర్తిగా లీనమై నటించాలని సన్నీ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని పంచడానికి చిత్రబృందం నిరంతరం శ్రమిస్తోందని ఆయన తెలిపారు. హాలీవుడ్ సినిమాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రామాయణం లాంటి మహాకావ్యాన్ని ఎన్నిసార్లు తెరకెక్కించినా కొత్తగానే ఉంటుందని, ఈ సినిమాతో ప్రపంచమంతా రామాయణం గొప్పతనాన్ని మరోసారి తెలుసుకుంటుందని సన్నీ డియోల్ ధీమా వ్యక్తం చేశారు.