Jaat | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీడియోల్ (Sunny Deol) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం జాట్ (Jaat). ఎస్డీజీఎం (SDGM) ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. రెజీనా కసాండ్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ మూవీని ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది గోపీచంద్ టీం. మాస్ ఫీస్ట్ గ్యారంటీ అని చెబుతున్నాడు సన్నీడియోల్. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. జాట్ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీకి రిషి పంజాబి సినిమాటోగ్రాఫర్ కాగా.. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్. గోపీచంద్ మలినేని ఈ సినిమా బాలీవుడ్ డెబ్యూ కావడం.. మరోవైపు సన్నీడియోల్ మొదటి తెలుగు సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
#JAAT GRAND RELEASE WORLDWIDE ON APRIL 10th ❤️🔥
In Hindi, Telugu & TamilMASS FEAST GUARANTEED 👊
Directed by @megopichand
Produced by @MythriOfficial & @peoplemediafcy
A @MusicThaman Mass Beat @RandeepHooda @vineetkumar_s @vishwaprasadtg @ReginaCassandra #SaiyamiKher pic.twitter.com/HxtObFu3RD— Sunny Deol (@iamsunnydeol) January 24, 2025
MASS Jathara | రవన్న మాస్ దావత్ షురూ.. రవితేజ మాస్ జాతర గ్లింప్స్ వచ్చేస్తుంది