టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులతోపాటు పాన్ ఇండియా లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు పుష్ప (Pushpa). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ స్టన్నింగ్ లుక్‌ను విడుదల చేశారు.
పుష్పలో మంగళం శ్రీను (Mangalam Srinu) పాత్రలో కనిపించబోతున్నాడు సునీల్ (Sunil). ఈ పాత్రలో సునీల్ ఎలా కనిపించబోతున్నాడనేది లేటెస్ట్ స్టిల్ ద్వారా తెలియజేశారు మేకర్స్. మెడలో గొలుసు, చేతికి పాత కాలపు వాచీ, చైన్ బ్రాస్లేట్, ఉంగరాలతో సగం బట్టతలతో ఉన్న సునీల్ సీరియస్‌గా సెల్‌ఫోన్ మాట్లాడుతున్న స్టిల్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. తాజా టాక్ ప్రకారం పుష్ప తొలి పార్టులో సునీల్ పాత్ర అల్లు అర్జున్ పోషించే పుష్పరాజ్‌కు ఛాలెంజింగ్‌గా ఉంటుందట.
ఇక సెకండాఫ్‌లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఆ ఛాలెంజింగ్ రోల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తమ్‌శెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పుష్ప రెండు పార్టులుగా రాబోతుంది. డీఎస్పీ కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతున్నాయి. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Presenting the face of evil
— BA Raju's Team (@baraju_SuperHit) November 7, 2021
Introducing @Mee_Sunil as #MangalamSrinu from #PushpaTheRise 🔥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @ThisIsDSP @MythriOfficial @adityamusic @PushpaMovie pic.twitter.com/gg6iponTyA
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Kamal Hassan: తన బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్
Pawan Kalyan: లాలా భీమ్లా సాంగ్ విడుదల.. పవన్ అభిమానులకి పూనకాలే..!