‘దర్శకుడు వెంకటేశ్ ఈ కథ చెప్పినప్పుడు కంగారు పడ్డాను. ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అనిపించింది. అయితే దర్శకుడు వెంకటేశ్ అద్భుతంగా డీల్ చేశాడు’ అని నారా రోహిత్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘సుందరకాండ’. వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌కుమార్ కథానాయికలు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్‌రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాతలు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నారా రోహిత్ విలేకరులతో ముచ్చటించారు. ‘ఈ సినిమా చూస్తునంతసేపూ ఆడియన్స్‌లో ఒక స్మైల్ ఉంటుంది. చాలా లైవ్లీగా ఫన్‌తో సినిమా ఉంటుంది. ఈ జనరేషన్‌కి ఇది చాలా కొత్త కథ. ఇందులో క్యారెక్టర్లను బాగా ఎంజాయ్ చేస్తారు.’ అని తెలిపారు నారా రోహిత్. ఇందులోని పాత్రలకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయని, 30 దాటినా కూడా కావలసిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం వెతకడం అనేది ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింటని, ఇందులో తనది కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అనీ, ఆ కాంప్లికేషన్ నుంచే ఫన్ జనరేట్ అవుతుందని నారా రోహిత్ చెప్పారు. ‘ఇందులో హీరోకు కావాల్సిన 5 క్వాలిటీలు చాలా ప్రత్యేకం. వాటిని స్క్రీన్‌పై చూస్తేనే కిక్కు. ఈ సినిమా నా ప్రొడక్షన్లోనే మొదలైంది. ఈ కథ నచ్చి నా కజిన్ సంతోష్, గౌతమ్, రాకేష్, వెంకీ జాయినయ్యారు. ఈ కథే మా నలుగుర్నీ కలిపింది.’ అని పేర్కొన్నారు