Sumanth Prabhas | తొలి చిత్రం ‘మేం ఫేమస్’తో నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు సుమంత్ప్రభాస్. ప్రస్తుతం ఆయన తన రెండో చిత్రంలో నటిస్తున్నారు. సుభాష్‌చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవల సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రేలంగి, భీమవరం, సకినేటిపల్లి లంక, అంతర్వేది ఆలయ ప్రాంగణంలో సహా అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిగింది.
ఈ షెడ్యూల్లో సుమంత్ప్రభాస్, నిధిప్రదీప్, జగపతిబాబు, లైలా, రాజీవ్ కనకాల పాల్గొన్నారు. ఈ నెలాఖరులో మూడవ షెడ్యూల్ ప్రారంభిస్తామని గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని చిత్రబృందం పేర్కొంది. రాజీవ్ కనకాల, హర్షవర్దన్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిసంతోష్, సంగీతం: నాగవంశీ కృష్ణ, నిర్మాణ సంస్థ: రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్, దర్శకత్వం: సుభాష్‌చంద్ర.