Anaganaga | టాలీవుడ్ యాక్టర్ సుమంత్ (sumanth) లీడ్ రోల్లో నటించిన ఈటీవీ విన్ ఒరిజినల్ చిత్రం అనగనగా (Anaganaga). సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుమంత్ వ్యాస్ సార్‌గా నటించాడు. అనగనగా మే 15న ప్రేక్షకుల ముందుకొచ్చిందని తెలిసిందే. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది.
నిజాయితీతో కూడిన స్టోరీ టెల్లింగ్, సుమంత్ ఇతర సహాయ నటీనటుల మధ్య సాగే భావోద్వేగపూరిత సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కాగా ఈ చిత్రం అరుదైన మైల్‌స్టోన్‌ను చేరుకుంది. అనగనగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటి సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.
కొత్తదనంతో కూడిన సినిమాలు చేసే విషయంలో ఎప్పుడూ ముందుండే సుమంత్ సరైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ చౌదరి హీరోయిన్గా నటించగా.. మాస్టర్ విహర్ష్, అవసరాల శ్రీనివాస్, అనుహాసన్, రాకేశ్ రాచకొండ ఇతర కీలక పాత్రల్లో నటించారు. చందు రవి సంగీతం అందించాడు.
100 Million+ Streaming Minutes
& 100 Million+ Emotional TearsYour love made Anaganaga a heartfelt journey, not just a film.
Thank you for watching, feeling, and sharing every moment with us.@isumanth @rakeshreddy1224 @pavan_pappula @arvindmule_pd @ashwinrajasheka… pic.twitter.com/gKfjPiXbhP— ETV Win (@etvwin) May 19, 2025
Raashii Khanna | షూటింగ్లో గాయపడ్డ రాశి ఖన్నా.. ఫొటోలు వైరల్
Abishan Jeevinth | ‘టూరిస్ట్ ఫ్యామిలీ’కి రాజమౌళి ఫిదా.. దర్శకుడి ఎమోషనల్ రిప్లై
Pawan Kalyan | ఆస్కార్ ఎక్కడుంది సర్?.. కీరవాణిని అడిగిన పవన్ కల్యాణ్.. వీడియో