Abishan Jeevinth – SS Rajamouli | టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి తమిళ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో తాను చూసిన బెస్ట్ సినిమా ఇదేనంటూ కితాబిచ్చాడు.
నిన్న అద్భుతమైన, చాలా అద్భుతమైన టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమా చూశాను. ఈ చిత్రం హృదయాన్ని హత్తుకునేలా ఉంది, కడుపుబ్బ నవ్వించే కామెడీతో పాటు ఎమోషన్తో.. ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తికలిగించేలా ఉంది. అభిషన్ జీవింత్ ఈ సినిమాను గొప్పగా రాయడంతో పాటు దర్శకత్వం వహించాడు. ఇటీవల కాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇదే. మీరంతా కూడా కచ్చితంగా చూడండంటూ రాజమౌళి రాసుకోచ్చాడు. అయితే రాజమౌళి వ్యాఖ్యలపై తాజాగా టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవింత్ స్పందిస్తూ.. జక్కన్నకి కృతజ్ఞతలు తెలిపాడు.
నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను… ఆయన సినిమాలను థియేటర్లలో కళ్ళు పెద్దవి చేసుకుని చూసేవాడిని, ఎప్పుడూ ఊహించలేదు ఒకరోజు ఆ ప్రపంచాలు సృష్టించిన మనిషి నా పేరు పలుకుతారని. ఎస్ ఎస్ రాజమౌళి సర్. మీరు ఈ కుర్రాడి కలను ఊహకు అందని స్థాయికి తీసుకెళ్లారు.
మీ ట్వీట్ చాలా అద్భుతమైన ఆశ్చర్యం కలిగించింది, ఇది నిజంగా మా రోజును మరింత ప్రత్యేకంగా చేసింది. మాటలకు మించి కృతజ్ఞతలంటూ అభిషన్ రాసుకోచ్చాడు.
Thank you so much, @ssrajamouli sir! Your tweet was such a wonderful surprise, it truly made our day even more special. Grateful beyond words 🙂 https://t.co/n5kx39PE5c
— Abishan Jeevinth (@Abishanjeevinth) May 19, 2025
Still in disbelief… I watched his films with stars in my eyes, never imagining that one day, the man who built those worlds would speak my name. @ssrajamouli sir, you’ve made this boy’s dream larger than life.
— Abishan Jeevinth (@Abishanjeevinth) May 19, 2025