Hari Hara Veera Mallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతికృష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా జూన్ 12 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతుంది చిత్రయూనిట్. అయితే తాజాగా నటుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్. ఎమ్ కీరవాణిని కలిశాడు. స్వయంగా కీరవాణి స్టూడియోకి వెళ్లిన పవన్ కీరవాణితో ముచ్చటించారు.
ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డు ఎక్కడుంది సర్. ఒకసారి చూడాలని పవన్ కళ్యాణ్ కీరవాణిని కోరగా.. కీరవాణి స్పందిస్తూ.. అది ఎదురుగా పెట్టుకుంటే గర్వం వచ్చేస్తుందని దాచి పెట్టానంటూ నవ్వులు పూయించాడు. అనంతరం ఆస్కార్‌ను తెచ్చి పవన్ కళ్యాణ్‌కి ఇచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
‘హరిహర వీరమల్లు’ సినిమా విషయానికి వస్తే.. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం ‘హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అంటూ విడుదల కాబోతుంది. కాగా, ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పాల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Oscar Ekkadundi Sir 🫶🙂↕️#HariHaraVeeraMallu #PawanKalyan #RRRMovie pic.twitter.com/qTiTGSqtmy
— Movies4u Official (@Movies4u_Officl) May 20, 2025