‘ నా కెరీర్లో ‘మళ్లీ రావా’ తర్వాత అద్భుతమైన అనుభూతిని అందించిన కథ ‘అనగనగా’. దర్శకుడు సన్నీ, రచయిత దీప్తి ఎంతో చక్కగా సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాను అడివి శేషుకు చూపించాను. తాను చాలా ఎమోషనల్ అయ్యాడు. సినిమాలో విషయం ఉందని మెచ్చుకున్నాడు. అతని నమ్మకాన్ని ప్రేక్షకులు కూడా బలపరిచారు. బేసిగ్గా సినిమాలన్నీ థియేటర్లలో విడుదలయ్యాక ఓటీటీకి వస్తాయి. కానీ ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి, కొన్ని థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నాం. ఆడియన్స్ బిగ్ స్క్రీన్‌పై కూడా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా’ అని హీరో సుమంత్ తెలిపారు.
ఆయన కథానాయకుడిగా రూపొందిన ఫీల్‌గుడ్ ఎంటైర్టెనర్ ‘అనగనగా’. కాజల్ చౌదరి కథానాయిక. సన్నీ సంజయ్ దర్శకుడు. రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మాతలు. ఓటీటీలో విడదలైన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలందుకుంటన్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సుమంత్ మాట్లాడారు.
దర్శకుడు సన్నీ మాట్లాడతూ ‘ఈ కథ మమ్మల్ని అమ్మలా జోలపాడింది. నాన్నలా ధైర్యాన్నిచ్చింది. గరువులా జ్ఞానాన్ని నేర్పింది. ఈ సినీ ప్రపంచానికి మా అందర్నీ పరిచయం చేసింది. ఇంతటి ప్రోత్సాహాన్నిచ్చిన ఈటీవీ విన్ వారికీ, మా హీరో సుమంత్గారికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. వ్యాస్ పాత్రలో సుమంత్‌ని తప్ప మరొకర్ని ఊహించలేను. అంతబాగా చేశారాయన.’ అని చెప్పారు. ఇంకా అతిథులుగా వచ్చిసిన అడివి శేష, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి చిత్రబృందానికి అభినందనలు అంఇంచారు. చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి కూడా మాట్లాడారు.