Kumari 22F | పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన కుమారి 21 ఎఫ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్‌తో తెలుగులో లీడ్ హీరోయిన్గా తొలిసారి సూపర్ హిట్టందుకుంది ముంబై భామ హెబ్బా పటేల్. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పాపులర్ రైటర్ కమ్ డైరెక్టర్ సుకుమార్ కథనందించాడు.
ఈ మూవీకి సీక్వెల్ రాబోతుందని.. సీక్వెల్‌కు కుమారి 22F టైటిల్ కూడా ఫిక్స్ చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సుకుమార్ సతీమణి తబిత సుకుమార్ తన కొత్త ప్రొడక్షన్ బ్యానర్ తబితా సుకుమార్ ఫిలిమ్స్ పై ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనుందని కథనాలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. కాగా ఈ క్రేజీ సీక్వెల్ కథకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది.
కుమారి 22F కథ రొమాంటిక్ టచ్‌తో ఆధ్యాత్మిక మార్గంలో సాగనుందట. ఇదే నిజమైతే ఈ సారి సుకుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడనేది అర్థమవుతోంది. డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ చివరగా 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఒకవేళ కుమారి 22F ట్రాక్‌పైకి వెళ్లేది నిజమైతే ఈ మూవీని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తాడా..? లేదంటే కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్టును టేకోవర్ చేస్తాడా.. ? సీక్వెల్లో కూడా హెబ్బా పటేల్ టైటిల్ రోల్లో కనిపిస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Shreyas Talpade | భారీ పెట్టుబడి మోసం కేసు .. చిక్కుల్లో బాలీవుడ్ నటులు శ్రేయస్ తల్పడే, అలోక్ నాథ్
The Girlfriend Trailer | రష్మిక మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ విడుదల
Srinu Vaitla | శ్రీను వైట్లకి హీరో దొరికాడా..ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..!