Dasara | టాలీవుడ్ స్టార్ హీరో నాని (Nani) నటిస్తోన్న మాస్ ఎంటర్టైనర్ దసరా (Dasara). డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 30న (రేపు) థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని అండ్ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మీడియాతో చిట్ చాట్ చేశాడు. దసరా సినిమా విశేషాలు డైరెక్టర్ మాటల్లోనే..
స్క్రిప్ట్ ఎప్పుడు మొదలుపెట్టారు..? రంగస్థలం ముందా.. తర్వాతా?
రంగస్థలం ముందే నాకు ఒక ఐడియాఉంది. నా చిన్నతనం నుంచి వింటున్న కథ ఇది. మీరు సినిమా చూసిన తర్వాత నాలో స్ఫూర్తిని కలిగించింది ఏంటో అర్థం చేసుకుంటారు. వాస్తవ ఘటన చుట్టూ తిరిగే కథాంశంతో దసరా ఉంటుంది.
సినిమా జర్నీ ఎలా మొదలైంది..?
10వ తరగతి పూర్తయ్యాక సుకుమార్ తెరకెక్కించిన జగడం చూశా. ఆ చిత్రం నాకు చాలా స్ఫూర్తి కలిగించింది. ఫిల్మ్ మేకింగ్ ఆసక్తి అక్కడి నుంచే మొదలైంది. సుకుమార్ సార్‌ను ప్రత్యక్షంగా కలిశా. షార్ట్ ఫిల్మ్ చేయమని అడిగారు. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చారు.
తెలంగాణ యాసలో ఉండే పాత్రకు కీర్తిసురేశ్నే ఎందుకు సెలెక్ట్ చేశారు..?
తెలుగమ్మాయి కోసం ఎనిమిది నెలలు తీవ్రంగా వెతికాను. ఈ పాత్రకు స్థానికులను సంప్రదిస్తే.. సినిమాలో నటించేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. తెలుగు అమ్మాయికి నాని అన్న కూడా ఒకే చెప్పాడు. కానీ తెలుగమ్మాయిని పట్టుకోలేకపోయా. కీర్తి సురేశ్ సూపర్ ఎనర్జీతో ఉంటారు. డబ్బింగ్ కూడా చెప్పారు.
నానిని మాస్ అవతార్‌లో ప్రేక్షకులు అంగీకరిస్తారా..?
సినిమా చేసేటప్పుడు అలాంటి కొలమానాలేమి పెట్టుకోలేదు. ఫిల్మ్ మేకింగ్ పట్ల ఎంత నిబద్దతతో ఉన్నాననేదే నాకు ముఖ్యం. ప్రేక్షకులు సినిమాను కథలో భాగంగా చూస్తారు. నానిని మాస్ అవతార్‌లో అంగీకరిస్తారు.
సినిమా బడ్జెట్ విషయంలో ఏమైనా ఆందోళన చెందారా..?
ఫస్ట్ షెడ్యూల్ తర్వాత బడ్జెట్‌ను పెరుగుతుందని నాకు, నాని అన్నకు, సుధాకర్ చెరుకూరికి అర్థమైంది. సినిమాకు ఎంత ఖర్చవుతుందో మాకు స్పష్టత ఉంది. కథ చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత బడ్జెట్ గురించి సుధాకర్ చెరుకూరిగారికి చెప్పాను. కొన్ని సందర్భాల్లో బడ్జెట్‌ను నియంత్రించడానికి ప్రయత్నించాను.
లైవ్ లొకేషన్లలో షూటింగ్‌కు ప్రయత్నించలేదా..?
లైవ్ లొకేషన్లలో షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నా. షూటింగ్ కోసం నేను అనుకున్న విధంగా ఓ ప్రదేశాన్ని గుర్తించా. కానీ చివరి నిమిషంలో జీవో కారణంగా చిక్కు వచ్చిపడ్డది. దీంతో ఆ ప్లాన్ నుంచి వెనక్కి తగ్గాం. తద్వారా షూటింగ్‌కు 106 రోజులు పట్టింది.
మీ ఫ్యూచర్ సినిమాల గురించి..
ప్రస్తుతం కొన్ని కథలపై పనిచేస్తున్నా. ఆ కథల గురించి ఇప్పటివరకు ఎవరితో చర్చించలేదు. రేపు దసరా విడుదలవుతున్న నేపథ్యంలో ఎక్జయిటింగ్‌గా, టెన్షన్‌గా ఉంది.
Ravi Kishan | రేసుగుర్రం విలన్నూ వదలని కాస్టింగ్ కౌచ్.. హాట్ టాపిక్‌గా రవికిషన్ కామెంట్స్
Narayana & Co Teaser | ఎంటర్టైనింగ్గా సుధాకర్ కోమాకుల నారాయణ అండ్ కో టీజర్
Ponniyin Selvan-2 | పొన్నియన్ సెల్వన్ -2 ఈవెంట్‌కు మరో స్టార్ హీరో..?